ఇంట్లో నిమ్మకాయలు, పసుపు కుంకుమ..కుటుంబం మొత్తం మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఇంట్లో నిమ్మకాయలు, పసుపు కుంకుమ..కుటుంబం మొత్తం మృతి

August 14, 2020

Four Family Members In Wanaparthy

వనపర్తి జిల్లాలో ఓ కుటుంబ సభ్యులంతా అనుమానస్పద స్థితిలో చనిపోయారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, ఇంట్లో నిమ్మకాయలు, పసుపు కుంకుమ ఉండటం పలు అనుమానాలకు దారి తీసింది. రేవల్లి మండలం నాగపూర్‌లో ఆ దృశ్యాలను చూసి షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. క్షుద్రపూజలే  కారణమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) ఊహించని రీతిలో చనిపోయారు. ఇంట్లో వీరంతా వేర్వేరు చోట్ల పడిపోయారు. హాల్‌, డైనింగ్ హాల్, వంటగది, ఇంటి వెనకలా ఇలా అంతా వేర్వేరు ప్రాంతాల్లో చనిపోయి ఉన్నారు. దీంతో ఇది ఆత్మహత్యా, హత్యా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిమ్మకాయలు, పసుపు కుంకుమ, అగర బత్తీలు ఉండటంతో పాటు ఇంటి ఆవరణలో పలుచోట్ల గుంతలు తవ్వి ఉండటం గమనించారు. దీంతో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.