శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

April 25, 2022

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 12 మంది కనుపూరుమ్మ ఆలయాన్ని దర్శించుకుని, తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి, నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రేణిగుంట -నాయుడుపేట ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనుపూరుమ్మ ఆలయాన్ని దర్శించుకుని, మినీ వ్యాన్లో తిరుపతికి బయల్దేరారు.

ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని అర్ధనారీశ్వర స్వామి ఆలయం సమీపంలోకి రాగానే, వారి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో అర్జునయ్య, సరసమ్మ దంపతులతో పాటు మారెమ్మ అలియాస్ కావ్య అక్కడికక్కడే మృతి చెందారు. టెంపో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనలో స్పాట్‌లోనే నలుగురు మరణించగా, మరో 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అక్కడి స్థానికులు హుటాహుటిన వైద్య చికిత్స కోసం శ్రీకాళహస్తి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమించటంతో వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు.