four monkeys attacking a person video viral
mictv telugu

ఇంత అల్లరి కోతులా .. వీడియో చూస్తే నవ్వాగదు

November 3, 2022

చిలిపి చేష్టలకు, అల్లరి పనులకు కేరాఫ్ అడ్రస్ కోతులు. వాటి ప్రవర్తనతో కొన్నిసార్లు జనాన్ని పిచ్చెక్కిస్తాయి. కోతి చేష్టలు చాలా సార్లు నవ్వు తెప్పించినా కొన్నిసార్లు మాత్రం ఇబ్బందిపెడతాయి. ఇప్పటికే కోతులు చేసిన అల్లరి వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజగా కొన్ని కోతులు కలిసి ఓ వ్యక్తిని ఆగం ఆగం చేసిన వీడియో బయటకొచ్చింది.

చెట్టుకింద కూర్చున్న ఓ వ్యక్తి లేస్ తింటూ సేద తిరుతున్నాడు. అక్కడికి వచ్చిన నాలుగు కోతులు లేస్ ప్యాకెట్‌ను లాక్కొనేందుకు ప్రయత్నించాయి. ఆ ప్రయత్నంలో అతడిపై దాడికి దిగాయి. ఒక కోతి లేస్ ప్యాకెట్ లాక్కోడానికి ప్రయత్నించగా, మరో కోతి అతనిపై దూకి కిందకు పడేసింది. ఈ క్రమంలో లేస్ కిందపడిపోవడంతో చక్కగా అతని పక్కన కూర్చోని లాగించేసాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. కోతులతో జర జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు వీడియో చూసిన వాళ్లు.