పెళ్లైన నెలకే నాలుగు నెలల గర్భం..కంగుతిన్న భర్త - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లైన నెలకే నాలుగు నెలల గర్భం..కంగుతిన్న భర్త

June 18, 2022

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహారాజ్ గంట్లో ఓ యువకుడు ఎన్నో ఆశలతో నెల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన నెల రోజులకే ఆ యువతి కడుపులో నొప్పిగా ఉందంటూ, భర్తకు తెలియజేసింది. దాంతో హుటహూటిన ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆ యువకుడికి ఉహించలేని షాక్ తగిలింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. నాలుగు నెలల గర్భవతి అని చెప్పారు. దాంతో యువకుడితోపాటు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. పెళ్లి అయ్యి నెల రోజులు గడవక ముందే నాలుగు నెలల గర్భమని తేలడంతో యువకుడి తల్లిదండ్రులు ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు.

అనంతరం పెళ్లికాకముందే ఈ విషయాన్ని తమకెందుకు చెప్పలేదంటూ, యువతి తల్లిదండ్రులతో యువకుడి బంధుమిత్రులు వాగ్వాదానికి దిగారు. యువతి చేసిన పాడుపనిపై కోపంతో రగిలిపోయిన యువకుడు అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.