హైదరాబాద్‌లోని రాణిగంజ్‌లో హార్డ్‌వేర్, కోట్ల రూపాయల ఆస్తులు, భార్యా ఇద్దరు పిల్లలతో పచ్చని సంసారం.. ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి. ఎవరైనా ఇలాంటి జీవితాన్నే కోరుకంటారు. ఇవన్నీ ఉంటే చాలు లైఫ్ సెటిల్ అయిపోనట్లే. ఇలాంటి జీవితం అందరికీ రాదు. అందుకే, ఇలాంటి విలాసవంతమైన జీవితాన్ని ఎవరూ వదులుకోరు. కానీ, అతడు మాత్రం.. సంసార జీవితం, భౌతికమైన బంధాలు, కోరికలు అన్నీ వృథా అని భావించాడు. వీటన్నంటిని త్యజించి.. కుటుంబంతో సహ సాధువుగా మారి సన్యాసం తీసుకోబోతున్నాడు.
నగరంలోని డీవీకాలనీలో జైన కుటుంబానికి చెందిన ప్రితేష్ సంఘ్వీ(45).. రాణిగంజ్‌లో హార్డ్‌వేర్ వ్యాపారిగా కొనసాగుతున్నాడు. ఆయన భార్య రిపాల్ సంఘ్వీ(42).. కుమారుడు తత్వ సంఘ్వీ(18), కుమార్తె హిర్వి సంఘ్వీ(10)లు నలుగురు.. సాధువులుగా మారి సన్యాసం పుచ్చుకోబోతున్నారు. దీక్షా మహోత్సవం తీసుకోబోతున్న సందర్భంగా ఆదివారం ఆ కుటుంబసభ్యులకు బంధువులు, స్నేహితులు, జైనులు కలిసి ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ నలుగురూ మార్చి 9న అహ్మదాబాద్‌లో సన్యాసం స్వీకరించబోతున్నారు.