తెగించేసారు..బ్యాంకును ఎలా దోచుకున్నారో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

తెగించేసారు..బ్యాంకును ఎలా దోచుకున్నారో చూడండి

February 20, 2020

Four people rob over Rs 8 lakh from bank

బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో పట్టపగలే దొంగలు వీరంగం సృష్టించారు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ముజఫర్పూర్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంక్ నుండి రూ.8 లక్షలు దోచుకున్నారు. ఈ సంఘటన మొత్తం సిసిటివి కెమెరాలో రికార్డయింది. ఈ దోపిడీ మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు జరిగింది. సీసీటీవీలో రికార్డు అయిన వీడియో ప్రకారం నలుగురు దుండుగులు బ్యాంకులోకి ప్రవేశించి నేరుగా క్యాషియర్ క్యాబిన్‌లోకి వెళ్లారు. ఈ సంఘటన జరిగినప్పుడు బ్యాంకు ఉద్యోగులతో పాటు 10 మందికి పైగా ఖాతాదారులు బ్యాంకు వద్ద ఉన్నారు.

మొత్తం డబ్బును ఒక సంచిలో తీసుకున్నారు. బ్యాంకు ఉద్యోగి అప్రమత్తమయ్యేలోపే దుండగులు నగదుతో పారిపోయారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.