బొగ్గు గనిలో ప్రమాదం.. నలుగురి మరణం - MicTv.in - Telugu News
mictv telugu

బొగ్గు గనిలో ప్రమాదం.. నలుగురి మరణం

March 7, 2022

boggu

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓ బొగ్గు గనిలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్జీ -3 బొగ్గు గనిలో పై కప్పు కూలడంతో ఒక అసిస్టెంట్ మేనేజర్ సహా ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాలను వెలికితీయడంతో పాటు మిగతా సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై దర్యప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో తోటి కార్మికులలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.