Home > Featured > బర్త్ డే రోజు స్కూల్ బస్సులో చిన్నారి నిద్ర.. సిబ్బంది నిర్లక్ష్యంతో

బర్త్ డే రోజు స్కూల్ బస్సులో చిన్నారి నిద్ర.. సిబ్బంది నిర్లక్ష్యంతో

Four-year-old girl dies of suffocation in Qatar

నాలుగేళ్ల చిన్నారి పాప తన పుట్టినరోజు నాడే చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. బాలిక మరణానికి కారణమైన ఆ స్కూల్ మూసివేయాలని ఏకంగా దేశ ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. ఖతార్ దేశంలో జరిగిన ఈ సంఘటన వివరాలు కుటుంబ సభ్యుల మేరకు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన మిన్సా మరియమ్ జాకబ్ (4) అనే పాప అల్ వక్రాలోని స్ప్రింగ్ ఫీల్డ్ కిండర్ గార్డెన్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. తన పుట్టినరోజు రావడంతో వేడుకలను తోటి విద్యార్ధులతో కలిసి జరుపుకోవాలని ఆశపడింది.

అనుకున్నట్టుగానే పుట్టినరోజు నాడు రోజులాగే స్కూల్ బస్ ఎక్కి పాఠశాలకు బయల్దేరింది. అయితే మార్గమధ్యంలో నిద్ర రావడంతో మిన్సా బస్సులోనే కునుకు తీసింది. బస్సు స్కూలుకు చేరిన తర్వాత విద్యార్ధులందరూ దిగి వెళ్లిపోగా, మిన్సా మాత్రం అందులోనే ఉండిపోయింది. అందరూ వెళ్లిపోయారనుకొని సిబ్బంది బస్సును పార్కింగ్ చేసి వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం డ్రైవరు బస్సు వద్దకు రాగా, అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న మిన్సా కంటపడింది. దాంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు పోయినట్టు వైద్యులు తేల్చి చెప్పేశారు. తీవ్రమైన ఎండలతో ఉక్కపోత వల్ల ఊపిరాడక చనిపోయినట్టు నిర్ధారించారు. దాంతో పుట్టిన రోజు నాడే నూరేళ్లు నిండాయంటూ పేరెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యాశాఖ స్పందించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ స్కూలును మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరణానికి కారణమైన ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated : 15 Sep 2022 9:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top