అల్లాహూ అక్బర్ అంటూ ముగ్గురి నరికివేత..  - MicTv.in - Telugu News
mictv telugu

అల్లాహూ అక్బర్ అంటూ ముగ్గురి నరికివేత.. 

October 29, 2020

స్వేచ్ఛ సౌభ్రాతృత్వా దేశంలో నెత్తుటేర్లు పారాయి. మతోన్మాదం తలకెక్కిన ఓ దుర్మార్గుడు చర్చిలో ముగ్గుర్ని నరికి అత్యంత కిరాతకంగా చంపాడు. ‘అల్లహూ అక్బర్’ అని అని కేకలేస్తూ ఓ మహిళకు శిరచ్ఛేదం చేశారు. మరో ముగ్గుర్ని తీవ్రంగా గాయపరిచాడు. ఫ్రాన్స్‌లోని నైస్ సిటీలోని ఓ చర్చిలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగుణ్ని అదుపులోకి తీసుకున్నారు. మతోన్మాదాన్ని సహించబోమని ఫ్రాన్స్ ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

ఇది పక్కా ఉగ్రావాద దాడేనని, ఇలాంటి వాటిని సహించబోమని నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసీ హెచ్చరించారు. ఇటీవల పారిస్ శివారులోని ఓ స్కూల్లో చరిత్ర ఉపాధ్యాయుణ్ని ఓ వ్యక్తి కాల్చి చంపడం తెలిసిందే. భావప్రకటన స్వేచ్ఛ అంశాన్ని బోధిస్తూ ఆ ఉపాధ్యాయుడు మహమ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించాడు. విషయం తెలుసుకున్న దండగుడు స్కూలుకు వెళ్లి కాల్చి చంపాడు. మరోపక్క.. క్రైస్తవ యవకుడికి ప్రేమించిన ముస్లిం ప్రవాస యువతికి ఆమె తల్లిదండ్రులు గుండు గీయించడం కూడా వివాదానికి దారి తీసింది. ప్రభుత్వం నిందితులను దేశం నుంచి బహిష్కరిచింది. దీంతో ఇస్లాం ఉగ్రవాదులు ఫ్రాన్స్‌పై కత్తికట్టారు.