fraud-alert-scamsters-using-google-pay-phone-pe-to-con-you
mictv telugu

గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నారా…జాగ్రత్త

March 18, 2023

ఎక్కడా సేఫ్టీ లేదు. కొంతమంది నేరుగా మోసం చేస్తుంటే మరికొంతమంది ఆన్ లైన్ మోసాలు ఈజీగా చేసేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. సరికొత్త ఆన్‌లైన్ మోసాలకు తెరతీస్తున్నారు. బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బు కాపాడుకోవడమే కష్టంగా మారింది. రోజురోజుకూ కొత్త కొత్త మార్గాలు కనిపెడుతూ రెచ్చిపోతున్నారు. తాజాగా ముంబయికి చెందిన 81 మందిని మోసం చేశారు. 16 రోజుల్లో ఏకంగా రూ. కోటి కొట్టేశారు సైబర్ నేరగాళ్ళు. బ్యాంక్ కేవైసీ, పాన్ స్కామ్ విరాలను తెలుసుకుని మరీ డబ్బును దోచేశారు. అది కూడా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా.

ఈ సైబర్ క్రిమినల్స్ ఎంత ఈజీగా డబ్బును కొట్టేశారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ముందు మన గూగుల్ పే, ఫోఫే వివరాను తెలుసుకుని మనకు కొంత డబ్బులు పపిస్తారు తర్వాత ఏమీ ఎరగనట్లు మిస్టేక్‌లో మీ గూగుల్ పే లేదా ఫోన్ పే కు డబ్బులు వచ్చాయని, దయచేసి తిరిగి పంపించాలని అడుగుతారు. నిజమే కాబోలు అనుకుని డబ్బులు వెనక్కు పంపేస్తుంటారు. అంతే.. ఈ ఒక్క చిన్న పొరపాటు చాలు…మన మొత్తం బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడానికి. దీన్నే మాల్ వేర్ ఎటాక్ అంటారు.

టెక్నాలజీని అడ్డుపెట్టుకుని దొంగతనాలు చేయడం ఇది. మాల్వేర్ ప్లస్ హ్యూమన్ ఇంజినీరింగ్ స్కామ్. దీనికి యూపీఐ యూజర్లే టార్గెట్. అంతకు ముందు ఫేస్ బుక్ లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడిగిన దందాలాంటిదే ఇది కూడా. అందులో అట్లీస్ట్ మనకు తెలిసిపోతుంద. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని. ఇందులో అలా పట్టుకోవడం కూడా కష్టం. రోజులో మనం చాలా ట్రాంజక్షన్స్ చేస్తుంటాం. అందులో ఒకరే అని పొరపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మోసం చేస్తున్న వాళ్ళు అడుగుతున్న మొత్తాలు కూడా ఎకకువ కాకపోవడంతో అంతే కదా అని పంపిచేస్తున్నారు. దాంతో దొరికిపోతున్నారు. అందుకే పొరపాటున వచ్చిందని కాల్ చేసి, లేదా మెసేజ్ చేసే వారిని నమ్మొద్దని.. తిరిగి డబ్బులు పంపితే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఒక్కసారి కాల్ చేసిన వ్యక్తికి అలా డబ్బులు పంపితే పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి కేవైసీ డాక్యుమెంట్లు సహా బ్యాంకింగ్ డీటెయిల్స్ మొత్తం వారికి చేరతాయని అంటున్నారు.

అలా పొరపాటున డబ్బులు మీ అకౌంట్‌కు వచ్చాయని ఎవరైనా కాల్ చేస్తే ముందు మనం చేయాల్సిన పని వెంటనే రెస్పాన్స్ అవ్వకుండా ఉండడం. బ్యాంక్ ఆ సమస్యపై దృష్టిసారిస్తుందని, తమకేం సంబంధం లేదని చెప్పాలి. లేదా.. దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వచ్చి డబ్బును తీసుకోమని చెప్పాలని పోలీసులు చెబుతున్నారు. అప్పుడు అది నిజమైనదేనా? లేదా ఫ్రాడ్ అనేది తెలుస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా…యూపీఐ ట్రాంజక్షన్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని సూచిస్తున్నారు.