గ్రహాంతరవాసి లాంటి జంతువు ఫుటేజీ ఆన్లైన్ లో వైరల్ అయి రెండు నెలల అయింది. దాన్ని ఆ గ్రామ ప్రజలు అందరూ చితకబాదారు. కానీ అంతరించిపోతున్న ఒక రకమైన ఎలుగుబంటి అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసింది.
మామూలుగా జనాలకు గ్రహాంతరవాసులు అంటే ఒక భయం ఉంటుంది. బోర్నియోలోని సిబు కుగ్రామానికి సమీపంలో ఉన్న తోట కార్మికుల బృందం జనవరిలో ఒక విచిత్రమైన జంతువును మొదట గమనించింది. అదేంటో తెలియక గ్రహాంతరవాసి అనుకున్నారు. కర్రలతో కొట్టారు. ఇదంతా వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.
సురక్షితంగా..
ఎలుగుబంటి సురక్షితమైన ప్రదేశంలో ఉంది. సరవాక్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) లో ఉంది. ఆ ఆడ ఎలుగుబంటి నీళ్లు తాగింది. కానీ ఇప్పటికీ వెంట్రుకలు రాలేదు. అనారోగ్యంతో ఉంది. ఆ అనారోగ్యం ఏమిటో కనుగొనాలని ఆ కార్పొరేషన్ ఆఫీసర్ నిక్సన్ రాబీ తెలిపారు. అంతేకాదు.. మలేషియాలో కూడా ఇలాంటి ఎలుగుబంటిని కనుగొన్నారు. దీనికి సూర్య ఎలుగుబంటిగా భావిస్తున్నారు. ఎస్ఎఫ్సీ నుంచి ఒక బృందం జనవరి నుంచి ఈ ఎలుగుబంటి కోసం వెతుకగా చివరకు వారం కిందట కనిపించింది.
మళ్లీ అడవిలోకి..
ఆ ఎలుగుబంటి తనకు ఎదురైన సంఘటనల వల్ల భయపడి పోయింది. మనుషులను చూస్తేనే దూరంగా పారిపోతున్నది. అయితే అధికారులు దాన్ని బంధించి మాతంగ్ వన్యప్రాణి కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ రాబర్ట్ సెన్ అనే వైద్యుడి సంరక్షణలో ఉంచారు. ఆయన దానికి సరైన మందులను వేస్తున్నారు. ఈ ఎలుగుబంటి స్కిన్ ఇన్ఫెక్షన్, రక్తహీనతతో బాధుపడుతుందని చెప్పారు. అయితే ఈ ఎలుగుబంటి త్వరలోనే కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఆరోగ్యం మరింత మెరుగుపడితే.. తిరిగి అడవిలోకి పంపించాలని అధికారులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
పిల్లిని కోసుకుని తిన్నందుకు అరెస్ట్..
సన్నీలియోన్ ఫ్యాషన్ షో వద్ద బాంబు పేలుడు