Free cell phones, internet for all women: Ashok Gehlot
mictv telugu

మహిళలందరికీ ఉచితంగా సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్..

August 20, 2022

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతం నుంచి పట్టణాల వరకు ఉన్న మహిళందరికీ ఉచితంగా సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అశోక్ గెహ్లాట్ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతునప్పటికి, మహిళలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ హామీలకు కారణం ఏంటీ? అనే విషయంపై ఆరా తీస్తే, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

‘వచ్చే ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పటి నుంచే పావులు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఓ సరికొత్త పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో అర్హులైన 1.35కోట్ల మంది మహిళలకు ఉచితంగా సెల్‌ఫోన్లు పంపిణీతోపాటు, మూడేళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం ఇవ్వటానికి సిద్దమైంది. ఈ ఏడాది బడ్జెట్‌లో డిజిటల్ సేవా యోజన పథకాన్ని కూడా ప్రకటించింది. ఈ కొత్త పథకం కోసం గెహ్లాట్ ప్రభుత్వం మొత్తం రూ.12 కోట్లు ఖర్చు చేస్తుంది” అని అక్కడి ప్రతిపక్షాలు తెలియజేశాయి.

అయితే, మహిళలకు సెల్‌ఫోన్లు ఎలా అందిస్తారు అనే విషయంపై అధికారులు వివరాలను వెల్లడించారు.”చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరిట ప్రభుత్వ అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరిన కుటుంబాల్లోని మహిళలకు ఉచిత సెల్‌ఫోన్లు అందించి, మూడేళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తాం. అర్హులైన వారిని 1.35 కోట్లుగా లెక్క తేల్చాం. ఇవి డ్యూయల్ సిమ్ కార్డు ఫోన్లు. ఓ సిమ్‌కార్డ్ లాక్ చేసి ఉంటుంది. రెండో స్లాట్‌లో మాత్రం మరో కార్డు వేసుకోవచ్చు. టెలికం సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించాం. ఈ నెలాఖరుకల్లా బిడ్లను ఖరారు చేసి, 1.35 కోట్ల మందికి సెల్‌ఫోన్లు అందిస్తాం” అని పేర్కొన్నారు.