ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం జరుపుతారు. అయితే వారం ముందుగానే వేడుకలు ప్రారంభమవుతాయి. అయితే ఒక దేశం ఆ రోజు వరకు 95 మిలియన్ల కండోమ్ లను ఉచితంగా పంచాలని అనుకుంటున్నది.
మూడు రోజుల్లో రోజ్ డే తో ప్రేమికుల రోజు వేడుకలు మొదలవుతాయి. వారం రోజుల పాటు ఈ వేడుకలు చేసుకుంటారు ప్రేమికులు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని సురక్షితమైన సెక్స్ ను ప్రోత్సహించేందుకు థాయిలాండ్ కొన్ని యూనివర్సల్ హెల్త్ కేర్ కార్డ్ హోల్డర్స్ కు ఉచిత కండోమ్ లను పంపిణీ చేయనుంది. అనేక సుఖ వ్యాధుల సంక్రమణ, టీనేజ్ గర్భం కేసులు అధికంగా నమోదవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.
గోల్డ్ కార్డ్ హోల్డర్స్ కు..
థాయ్ లో 70 మిలియన్ల మందిలో 50 మిలియన్లు గోల్డ్ కార్డ్ హోల్డర్స్. ఆగ్నేయాసియా దేశం గోల్డ్ కార్డ్ హోల్డర్ లకు ఒక సంవత్సరం పాటు వారానికి 10 కండోమ్ లను అందచేస్తున్నది ప్రభుత్వ ప్రతినిధి రచాడ ధనాడిరెక్ తెలిపారు. కండోమ్ లు నాలుగు సైజుల్లో లభిస్థాయని.. ఫార్మసీలు, ఆసుపత్రుల ప్రాథమిక సంరక్షణ యూనిట్ల నుంచి వీటిని తీసుకోవచ్చని ఆమె తెలిపారు. ప్రజారోగ్యం పెంపొందించడానికి ఇది సహాయపడుతుందని రచాడ అభిప్రాయం. సిఫిలిస్, సర్వైకల్ క్యాన్సర్, గనేరియా, క్లామిడియా, ఎయిడ్స్ వంటి వ్యాధులను అరికట్టడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నది.
వ్యాధులు పెరుగుతున్నాయి..
థాయ్ లాండ్ లో లైంగికంగా సంక్రమించే వ్యాధులు పెరుగుతున్నందున అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. తాజా అధికారిక డేటా ప్రకారం.. 2021లో లైంగికంగా సంక్రమించే కేసుల్లో సగానికి పైగా సిఫిలిస్, గనేరియా ఉన్నాయి. 15 నుంచి 19, 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని డేటా చెబుతున్నది. ప్రతి వెయ్యి మందిలో 15 నుంచి 19 సంవత్సరాల వయసు వారు 24.4 మంది బాలికలు జన్మనిచ్చారు.
ఇవి కూడా చదవండి :
వాణీ జయరాం మృతికి వెనక అనుమానం.. రక్తపు మడుగులో..
జూ.ఎన్టీఆర్తో లాభం లేదు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు