Free Darshan tickets released today: TTD
mictv telugu

నేడే ఉచిత దర్శనం టికెట్లు విడుదల: టీటీడీ

September 29, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శన టికెట్లను నేడు విడుదల చేస్తామని బుధవారం సాయంత్రం ప్రకటించారు. అయితే, ఈరోజు విడుదల చేయబోయే టికెట్లు వృద్ధులు, దివ్యాంగుల కోటాకు సంబంధించినవిగా పేర్కొన్నారు.

”అక్టోబర్‌ నెలకు సంబంధించి, వృద్ధులు, దివ్యాంగుల కోటా టెకెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నాం. వచ్చే నెల 1 నుంచి 5 వరకు మినహా మిగిలిన రోజులకు భక్తులు బుక్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే, రెండేళ్ల తర్వాత తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సింహ వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు. ఉదయం 8 గంటలకు వాహన సేవ ప్రారంభం కానుంది. కావున భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం” అని తెలియజేశారు.