free entry in all museums and tourist attractions From August 5 to 15 in Hyderabad
mictv telugu

బంపర్ ఆఫర్.. గోల్కొండ‌,చార్మినార్‌.. ఎక్కడైనా ఫ్రీ ఎంట్రీ

August 4, 2022

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌ైన సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకుకేంద్ర ప్రభుత్వం ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పర్యాటకులకు ఓ శుభవార్త తెలిపింది. దేశంలోని మ్యూజియాలు, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో 10 రోజులపాటు ఉచిత ప్ర‌వేశం క‌ల్పించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ఈ మేరకు భార‌త పురావ‌స్తు శాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతోన్న అన్ని మ్యూజియాలు, ఇత‌ర ప‌ర్యాట‌క ప్రాంతాలైన సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.

స్వ‌దేశీయులతో పాటు విదేశీయుల నుంచి ఎలాంటి ప్ర‌వేశ రుసుము వ‌సూలు చేయ‌బోమ‌ని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భార‌త పురావ‌స్తు శాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న మ్యూజియాలు,ఇత‌ర ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ ఉచిత ప్ర‌వేశం క‌ల్పిస్తున్న‌ట్లు అధికారులు వెల్లడించారు. గోల్కొండ‌,చార్మినార్‌తో పాటు ఇత‌ర సంద‌ర్శ‌న ప్ర‌దేశాల‌ను ప‌ర్యాట‌కులు ఉచితంగా చూడవచ్చ‌ని అధికారులు తెలిపారు.