అయోధ్య భక్తులకు కమ్మని భోజనం..  - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య భక్తులకు కమ్మని భోజనం.. 

November 21, 2019

ayodhya ............................

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని సుప్ర్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో దేశం నలుమూలల నుంచి అక్కడికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడి గుళ్లుగోపురాలను సందర్శిస్తున్నారు. సరయూ నది ఒడ్డున్న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. త్వరలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సాధుసంతులు చెబుతున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో వారికి భోజన సదుపాయాలు కల్పించే యత్నాలూ సాగుతున్నాయి. 

రామజన్మభూమికి దగ్గర్లోని అమావా రామమందిర్ సేవా ట్రస్ట్.. ‘రామ్ రసోయి’ పేరుతో వంటశాలను ఏర్పాటు చేసింది. భక్తులకు ఇందులో అన్నం, గోధుమ రొట్టెలు, కూర, దాల్ పెడతామని, ట్రస్ట్ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ కిశోర్ కునాల్ తెలిపారు. రామ్ రసోయిలో ఒకేసారి వెయ్యిమంది భక్తులు భోజనం చేయొచ్చు. త్వరలో రోజుకు ఐదువేల మంది భక్తులు వచ్చే అవకాశముందని, వారికి కూడా భోజన సదుపాయాలు కల్పిస్తామని స్థానిక హిందూ నేతలు చెబుతున్నారు.