గుంజీలు తీస్తే  టికెట్ ఫ్రీ.. ఆఫర్ సూపర్  - MicTv.in - Telugu News
mictv telugu

గుంజీలు తీస్తే  టికెట్ ఫ్రీ.. ఆఫర్ సూపర్ 

February 21, 2020

Squats

రైల్వే స్టేషన్‌కు వెళితే ప్లాట్‌ఫామ్ టికెట్ తప్పనిసరి. అది లేకుంటే ఫైన్‌తో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాలి. అలా కాకుండా ఉచితంగానే ఫ్లాట్‌ఫాంపై తిరిగేందుకు రైల్వేశాఖ ఓ సరికొత్త ప్రయోగం చేస్తోంది. కొంత సేపు గుంజీలు తీస్తే చాలు ఫ్రీగా ఫ్లాట్ ఫాంపైకి వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో శ్రీకారం చుడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

ఫ్రీ ప్లాట్ ఫాం టికెట్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. రైల్వేస్టేషన్‌లో ఓ మోషీన్ ఉంటుంది. దాని వద్దకు వెళ్లి 30 గుంజీలు తీయాలి. అలా తీసిన వెంటనే ఓ స్లిప్ వస్తుంది. దాని ద్వారా ఉచితంగానే ఫ్లాట్ ఫాం‌పైకి వెళ్లొచ్చు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించ వచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రజలకు డబ్బులు ఆదా కావడంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందంటూ కేంద్ర మంత్రి గోయల్ ట్వీట్ చేశారు. ఇదేదో బాగుందంటూ పలువురు నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.