50 లక్షల మందికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు - MicTv.in - Telugu News
mictv telugu

50 లక్షల మందికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు

April 20, 2018

మనిషి బతకడానికి తిండితిప్పలు ఎంత అవసరమో.. స్మార్ట్ ఫోన్ కూడా అంత అవసరమైనట్లు కనిపిస్తోంది. అయితే మనది పేద దేశం కనుక ఈ ఫోన్లు అందని జనం కోట్లలోనే ఉన్నారు. ఎంత బేసిక్ స్మార్ట్ ఫోన్‌ను కొనాలన్నా నాలుగైదువేలు పెట్టాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మహిళలకు, విద్యార్థులకు ఉచితంగా వీటిని అందించాలని నిర్ణయించింది.

సంచార్ క్రాంతి స్కీం కింద విద్యార్థులకు వీటిని అందిస్తారు. మే తొలివారంలో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఈ పథకాన్ని వికాస్ యాత్ర పేరుతో ప్రారంభిస్తారు. తొలి విడత కింద 30 లక్షలు, రెండో విడత కింద 20 లక్షల స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే అందరికీ కాకుండా కొన్ని అర్హతలు ఉన్నవారికే వీటిని అందిస్తారు. 1000 మంది జనాభా ఉన్న గ్రామాల్లో వీటిని అందిస్తారు. 40 లక్షల మంది మహిళలకు, ఇంటర్ డిగ్రీ చదువుతున్న 10 లక్షల మందికి పంపిణీ చేస్తారు