Free training for SC and ST candidates who want to pursue post graduation course in foreign universities
mictv telugu

హైదరాబాద్‌లో టోఫెల్, జీఆర్ఈ ఫ్రీ ట్రైనింగ్.. వారికి మాత్రమే

June 24, 2022

Free training for SC and ST candidates who want to pursue post graduation course in foreign universities

విదేశాల్లో మాస్టర్స్ చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు శుభవార్త. ఆయా దేశాల్లోని యూనివర్శిటీ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవాలనుకునే వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా తెలిపారు. మాస్టర్స్ అడ్మిషన్లకు నిర్వహించే టోఫెల్/ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ / జీమ్యాట్ తదితర అర్హత పరీక్షలకు ఉచిత శిక్షణ, సలహాలు అందించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలో స్టెఫిన్ లీడ్స్ అకాడమీలో ఈ శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అభ్యర్థులు ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు సుచిత్ర క్రాస్ రోడ్స్ సమీపంలో వెంకటేశ్వర ఎన్ క్లేవ్ భవనంలో రెండో ఫ్లోర్ లోని స్టెఫిన్ లీడ్స్ అకాడమీలో సంప్రదించి, తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు స్టెఫిన్ లీడ్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ వంగూరి బ్రహ్మయ్య 9030463377 నెంబరులో సంప్రదించాలన్నారు.