మేడారంలో భక్తులకు ఉచిత వైఫై సేవలు - MicTv.in - Telugu News
mictv telugu

మేడారంలో భక్తులకు ఉచిత వైఫై సేవలు

February 5, 2020

medaram....02

తెలంగాణ కుంభమేళ సమ్మక్క-సారలమ్మల జాతర ప్రారంభమైనది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది. ఈ ఏడాది మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేసింది. తాజాగా టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మేడారం భక్తులకు ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పించింది. 

భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు భక్తులకు ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. భక్తులకు వైఫై సేవలు నిరంతరాయంగా అందించేందుకు  బీఎస్ఎన్ఎల్ 20 వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేసింది. మేడారంలో ఉచితంగా బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలు వాడుకోవాలంటే యూజర్లు సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆన్ చేయండి. [email protected] పేరుతో వైఫై నెట్‌వర్క్ కనిపిస్తుంది. దానికి కనెక్ట్ అవండి. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఆ తర్వాత నాలుగు అంకెల పిన్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. స్టార్ట్ బ్రౌజింగ్ పైన క్లిక్ చేస్తే మీకు వైఫై కనెక్ట్ అవుతుంది.

మేడారంకు హెలికాఫ్టర్ సేవలు

భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి వచ్చాయి. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్టు వరకు హెలికాఫ్టర్ సేవలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు చార్జి చేయనున్నారు. జీఎస్టీ అదనం. దీంతో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి ప్రయాణికుడి వద్ద రూ.2999 నామ మాత్రపు చార్జీ వసూలు చేస్తున్నారు. భక్తులు హెలిక్యాప్టర్ సదుపాయంను ఉపయేగించుకోవటానికి ఫోన్ నెంబర్ 94003 99999కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.