సరదా కోసం చాలా మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. దీని కోసం మార్కెట్లో రకరకాల ప్రాణులను కొని తెచ్చుకుంటారు. ఇలాగే ఎంతో ముచ్చట పడి పిల్లిని తెచ్చుకున్న ఓ జంటకు ఊహించని షాక్ తగిలింది. అది క్రమంగా పెరుగుతున్న సమయంలో తాము తెచ్చుకున్నది పిల్లి కాదు.. పులి అని తెలిసింది. ఫ్రాన్స్‌లో ఈ విచిత్ర సంఘటన జరిగింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తొమ్మిది మంది అక్రమార్కులను అరెస్ట్ చేశారు.
నార్మండీకి చెందిన లా హవ్రే అనే దంపతులు రెండేళ్ల క్రితం సవన్నా జాతికి చెందిన పిల్లిని ఆన్లైన్ ప్రకటన చూశారు. వెంటనే వారిని సంప్రధించి రూ. 6 లక్షలు ( 6000 యూరోల)కు కొనుక్కున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో అపురూపంగా చూసుకున్నారు. ఇలా వారం గడిచిన తర్వాత అసలు విషయం బయటపడింది. తాము తెచ్చుకున్నది. మూడు నెలల పులి పిల్ల అని తెలుసుకొని భయపడిపోయారు. తొమ్మిది మంది స్మగ్లర్లతో పాటు అప్పటి నుంచి రెండేళ్ల పాటు జరిగిన సుధీర్ఘ విచారణ తర్వాత ఆ దంపతులను నిర్ధోషులుగా ప్రకటించారు. ప్రస్తుతం దాన్ని ఓ జూ పార్కులో సంరక్షిస్తున్నారు.