వెయ్యి ట్రాక్టర్లతో రైతుల వినూత్న నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

వెయ్యి ట్రాక్టర్లతో రైతుల వినూత్న నిరసన

November 27, 2019

French tractors roll into Paris to protest against 'agri-bashing'

ప్రభుత్వం అవంలంభిస్తున్న విధానాలు అక్కడి రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. అంతే ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ట్రాక్టర్లతో రోడ్డెక్కి వినూత్నంగా తమ నిరసన తెలిపారు రైతులు. దీంతో రోడ్లన్నీ ట్రాక్టర్లతో నిండిపోయాయి. ఫ్రాన్స్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఇలా ట్రాక్టర్లతో రైతులు తమ నిరసన తెలిపారు.  

వెయ్యి ట్రాక్టర్లతో రాజధాని పారిస్‌లోకి ప్రవేశించారు. దీంతో రోడ్ల మీద ట్రాక్టర్లు నిండిపోయాయి. ట్రాఫిక్ ఒక్కసారిగా స్తంభించిపోయింది. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేవరకు ఇదే తరహాలో నిరసన చేపడతామని రైతులు పేర్కొన్నారు. ఈ నిరసన గంటలు, రోజుల వరకు కూడా వెళ్లొచ్చని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రైతులతో కలవడానికి అంగీకరించే వరకు ట్రాక్టర్లు నగరాన్ని చుట్టుముట్టే ఉంటాయని ప్రాంతీయ రైతు సంఘం ప్రతినిధి ఎలిస్ డెస్పైనీ తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎలిస్ ఆరోపించారు. 

ఇదిలావుండగా జర్మనీ ప్రభుత్వ వ్యవసాయ విధానాలను నిరసిస్తూ 10,000 మంది రైతులు 5,000 ట్రాక్టర్లను బెర్లిన్‌ రోడ్లపైకి తీసుకువచ్చి నిరసన తెలిపారు. దీనిపై

కొత్త ఈయూ కమిషన్ అధ్యక్షుడు బుధవారం స్పందించారు. వ్యవసాయ వృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటిచ్చారు.