మీరు తరచుగా మూత్రవిసర్జన..కడుపునొప్పితో బాధపడుతున్నారా? అయితే అండాశయ క్యాన్సర్ కావచ్చు? - MicTv.in - Telugu News
mictv telugu

మీరు తరచుగా మూత్రవిసర్జన..కడుపునొప్పితో బాధపడుతున్నారా? అయితే అండాశయ క్యాన్సర్ కావచ్చు?

March 10, 2023

మహిళలు కొన్ని ఆనారోగ్య సమస్యలను అస్సలు పట్టించుకోరు. చిన్న చిన్న సమస్యలే పెద్ద వ్యాధులకు దారితీస్తాయి. తరచుగా మూత్ర విసర్జన, తరచుగా పొత్తికడుపులో చిన్నపాటి నొప్పి ఎదుర్కొంటున్న స్త్రీలు…అశ్రద్ధ వహించకూడదు. ఈ చిన్న సమస్యలే అండాశయ క్యాన్సర్‎కు దారి తీసే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అండాశయ క్యాన్సర్ అనేది మహిళలను క్రమంగా ప్రభావితం చేసే నిశ్శబ్ద కిల్లర్. ఈ వ్యాధి లక్షణాలు అంత సులభంగా బయటకు కనిపించవు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారని ప్రముఖ గైనకాలజిస్ట్, అపోలో మెడిక్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఏక్తా శర్మ తెలిపారు.

అండాశయ క్యాన్సర్ వ్యాధి కారణంగా రోగికి తేలికపాటి నుంచి తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే..దానిని సులభంగా నియంత్రించవచ్చని చెబుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి. ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకుందాం.

అండాశయ క్యాన్సర్ లక్షణాలు:
-ఆకలి లేకపోవడం.
– త్వరగా కడుపు నిండిన అనుభూతి.
– కడుపు గ్యాస్, మలబద్ధకం సమస్య.
– బరువు తగ్గడం.
– క్యాన్సర్ మరింత ముదిరినపుడు పొత్తికడుపు గడ్డలు ఏర్పడతాయి.

ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే…ప్రతిఏడాది మహిళలు ఆరోగ్య పరీక్ష తప్పనిసరిగా చేయించకోవాలి. ప్రతి ఏడాది హెల్త్ చెకప్ చేయించుకున్నట్లయితే ఈ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తింవచ్చు.

– ఈ వ్యాధిని గుర్తించడానికి అల్ట్రాసౌండ్, MRI, CT స్కాన్, రక్త పరీక్షలను ఉపయోగిస్తారు.

– ఈ వ్యాధి చికిత్స శస్త్రచికిత్స ద్వారా చేసిన క్యాన్సర్ ప్రభావిత అవయావాన్ని తొలగిస్తారు.

– ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం ఈ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించగలవు.