ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంత బాగా చేస్తున్నారో చూడండి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంత బాగా చేస్తున్నారో చూడండి..

April 3, 2018

పోలీసులు స్నేహితుల్లా మెలగాలని చేస్తున్న బోధనలు ఈ పోలీసులకు ఉల్టాగా అర్థమైనట్లు ఉన్నాయి. కోట్లు దిగమింగి, హత్యలు, అత్యాచారాలు చేసిన నేరస్తులే వాళ్లకు స్నేహితులు. సాధారణ పౌరులే నేరస్తులు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడని ఒక 21ఏళ్ల యువకుడినిపై చెన్నైన రక్షకభటులు చేసిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ఈ వీడియోల్లో మీరే చూడండి..

గతవారం ఈ దారుణం జరిగింది. టీనగర్‌లో తన వాహనంపై తల్లిని, సోదరిని తీసుకెళ్తున్న ప్రకాశ్ అనే యువకుడిని పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ లేదు, ఆపై ట్రిపుల్ రైడింగ్ అని తిట్టారు. దురుసుగా ప్రవర్తిస్తూ ప్రకాశ్ తల్లిని నెట్టేశారు. ఆమె కుప్పకూలిపోయింది. ప్రకాశ్ సోదరితోనూ అనుచితంగా ప్రవర్తించారు.  ప్రకాశ్‌కు కోపమొచ్చి ఓ పోలీసు కాలర్ పట్టుకున్నాడు. అంతే ఖాకీలు చెలరేగారు. ప్రకాశ్‌ను కరెంటు పోల్‌కు బంధించి చేతులు విరిచేశారు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రకాశ్ చేసింది తప్పే అని, అయితే జరిమానా విధించకుండా, చట్టపర చర్యలు తీసుకోకుండా ఇలాలా దాడికి చేయడం, ఆడవాళ్లను తోసెయ్యడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. ప్రకాశ్‌ను హింసిన పోలీసులు అతనిపై కేసు పెట్టి జైలుకు పంపారు. ఇటీవల తమిళనాడు తూత్తుకుడిలో ఒక ట్రాఫిక్ పోలీసు.. ఓ ద్విచక్రవాహనాన్ని కాలితో తన్నడంతో దానిపై ప్రయాణిస్తున్న గర్భిణి చనిపోవడం తెలిసిందే.