స్నేహితుడి ప్రాణాలకోసం జోలెపట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

స్నేహితుడి ప్రాణాలకోసం జోలెపట్టి..

October 25, 2019

Friends  .

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ ఓ సినిమాలో పాటను నిజ జీవితంలో రుజువు చేశారు. తమ స్నేహితుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే అతని వైద్యం కోసం జోలెపట్టారు. షేక్‌ జావీద్‌,నియాజ్‌ఇంటింటికి తిరిగి డబ్బులు సాయం చేయాలని వేడుకుంటున్నారు. పేద కుటుంబంలో పుట్టిన తమ స్నేహితుడికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా అనంతసాగర్‌లో జరిగింది.

అల్లీ ఇమామ్ షా,కాలేబీల కుమారుడు షేక్ ఖాజావలీ పదో తరగతి చదవిన తర్వాత ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగాలేక సెంట్రింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఏడాది క్రితమే హసీనాను వివాహం కూడా చేసుకున్నాడు. అంతా బాగుందని అనుకున్న సమయంలోనే అతనికి బోన్‌ మ్యారో అనే మహ్మరి సోకింది. డాక్టర్లను సంప్రదించగా వైద్యానికి రూ.25లక్షలకుపైగా ఖర్చవుతుందని తెలిపారు. ప్రస్తుతం అతనికి తమిళనాడులోని వేలూరు CMC ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయిస్తే అతని ప్రాణాలు నిబెట్టుకోవచ్చని చెప్పడంతో ఇంటింటికి తిరుగుతూ సాయం కోరుతున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ అభ్యర్థిస్తున్నారు. దాతలు ఎవరైనా ఉంటే 77994 47137, 9676 517112 నంబర్లకు ఫోన్ చేయాలని కోరుతున్నారు.