మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఫ్రెండ్షిప్ కీ రోల్ పోషిస్తుంది. మన హ్యాపీనెస్ కి, ఎదుగుదలకు అన్నిటికీ ఫ్రెండ్షిప్ హెల్ప్ చేస్తుంది. మంచి ఫ్రెండ్ షిప్ మంచి సంబంధాలను పెంపొందిస్తుంది. అది మన మానసిక ఆరోగ్యంపై చక్కని ప్రభావం చూపిస్తుంది. వ్యక్తులతో స్నేహం, బంధాలను ఏర్పరుచుకోవడం అనేది మన జీవితాల్లో మనమందరం ఆదరించే నిజమైన ఆనందం.
అందరం కూడా స్నేహం చిగురించే దశ నుండి అనుభవించడం, అభిప్రాయ భేదాలతో వ్యవహరించడం, సర్దుబాట్లు, ఎదగడం, కోపాలు ఇలాంటి వాటన్నింటిని అనుభవిస్తూ పెరిగాం.2018లో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఫ్రెండ్ని హగ్ చేసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు దూరమవుతాయని తేలింది.
ఆందోళనని తగ్గించే స్నేహం..
సన్నిహిత స్నేహాలు మన భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తాయి. స్నేహితులు ఉన్నవారు తక్కువ ఆందోళనతో ఉంటారని తేలింది. మన ఒత్తిడి, ఆందోళన స్థాయిలు… మనం జీవితంలో వ్యక్తులకు ఎలా ప్రాధాన్యత ఇస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది.27 శాతం మంది వ్యక్తుల మధ్య స్నేహంతో అధికస్థాయి సబ్థ్రెషోల్డ్ ఆందోళన లక్షణాలు సంబంధం కలిగి ఉన్నాయని తేలింది.
ఒంటరితనం వద్దు..
ఒంటరితనం భరించడం చాలా కష్టం. ఇదొక దిక్కుతోచని స్థితి. దానికంటే మనకి కావాల్సిన వ్యక్తుల ఫ్రెండ్షిప్ పొందడం చాలా మంచిది. ఎలా అయితే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా ఇద్దరు కలిస్తేనే ఇవ్వడం, స్వీకరించడం వంటివి ఉంటాయి. ఫోర్బ్స్ పరిశోధన ప్రకారం…సామాజిక సంబంధాలు, సానుకూల స్నేహితులతో కలవని వ్యక్తులే ఒంటరిగా ఉంటారు. ఈ సమస్య కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరు, మొత్తం శ్రేయస్సు పరంగా సంవత్సరానికి 406 బిలియన్లను కోల్పోతుంది. మనకు మంచి స్నేహితులు ఉంటేనే ఏదైనా కొత్తగా చేయడం, మాట్లాడడం, చూడడం లాంటివి జరుగుతాయి. అదే ఒంటరిగా ఉన్నప్పుడు పరధ్యానంలో ఉంటాం. ఏ పనీ చేయము.
స్ట్రెస్:
ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ లో ఉంటారు. ఏపనినీ సరిగ్గా చేయలేరు. దేని గురించీ ఆలోచించలేరు. ఎప్పుడూ ఆందోళనలోనే ఉంటారు. అదే ఫ్రెండ్స్ ఉంటే మనకు ఇబ్బంది కలిగించే విషయాల గురించి స్నేహితులతో మాట్లాడడం వల్ల ఆ బాధ కాస్తా తగ్గుతుంది. వారు మనకి ఏదైనా సొల్యూషన్ ఇచ్చినప్పుడు, సహాయం చేయాలనుకున్నప్పుడు మనకి ఉపశమనంగా ఉంటుంది.
చిన్నవారైనా, పెద్దవారైనా, స్నేహాలనేవి ఆరోగ్యం, శ్రేయస్సు వంటి మార్పులను పెంపొందిస్తాయి. మన స్నేహితులు మన మంచి గురించే మాట్లాడతారు. జీవితాంతం తోడుగా ఉండే స్నేహాలను చేయండి. ఆ మాధూర్యాన్ని మీరూ ఆస్వాదించండి.
friendship affect our mental health in a positive way, friend, affect, mental, health, positive