వింత ఆచారం..కప్పలకు విడాకులు ఇప్పించిన గ్రామస్థులు..  - MicTv.in - Telugu News
mictv telugu

వింత ఆచారం..కప్పలకు విడాకులు ఇప్పించిన గ్రామస్థులు.. 

September 12, 2019

 Frogs....

వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు చాలా మంది కప్పలకు పెళ్లిలు చేస్తుంటారు. శాస్త్రోత్తరంగా వివాహం చేసి వాటిని ఊరేగించి వరునదేవుడిని వేడుకుంటారు. మనదేశంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కానీ దీనికి పూర్తిగా భిన్నమైన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని వాటిని తగ్గించేందుకు ఏకంగా కప్పలకు విడాకులు ఇప్పించారు. ఈ వేడుకకు గ్రామంలోని ప్రజలంతా హాజరయ్యారు. వర్షాలు తగ్గాలంటూ వారంతా భగవంతున్ని వేడుకోవడం విశేషం. 

భోపాల్ లోని ఇంద్రపురి గ్రామంలో రెండు నెలల క్రితం వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి చేశారు. శివ్ సేవా శక్తి మండల్ సభ్యులు ఈ వేడుక నిర్వహించారు. తర్వాత అక్కడ భారీ వర్షాలు కురిశాయి. సాధారణం కంటే 26 శాతం ఎక్కువగా వర్షం పడింది. దీంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్థమైంది. 

కప్పలకు పెళ్లి చేసిన తర్వాత  వానలు ఎక్కువై ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు అభిప్రాయనికి వచ్చారు. వాటికి విడాకులు ఇప్పించాలని నిర్ణయించారు. పెళ్లి చేసుకున్నఆ రెండు కప్పలను తిరిగి పట్టి తీసుకొచ్చి, వాటికి సంప్రదాయ బద్ధంగా విడాకులు ఇప్పించారు. ఇప్పటికైనా అక్కడ వర్షాలు తగ్గుముఖం పడతాయో లేదో చూడాలని ఇది తెలిసినవారంతా అంటున్నారు.