From Jabardasth therefore came out: Anasuya
mictv telugu

జబర్దస్త్ నుంచి అందుకే బయటికొచ్చా: అనసూయ

August 14, 2022

టాలీవుడ్‌లో గతకొన్ని సంవత్సరాలుగా అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ, అప్పుడప్పుడు ఎమోషనల్‌‌గా ఎడిపిస్తూ, ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న బుల్లితెర కామెడీ షో ‘జబర్థస్త్’. ఈ షో మొదలైన రోజు నుంచి ఈరోజు వరకు మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది. మొదట్లో ఈ షోకి నటుడు నాగబాబు, ప్రముఖ హీరోయిన్ రోజా న్యాయ నిర్ణేతలుగా, అనసూయ, రష్మీలు యాంకర్‌లుగా వ్యవహరిస్తూ, వస్తున్నారు. ఈ క్రమంలో గతకొన్ని నెలలక్రితం నాగబాబు షో నుంచి బయటికిరాగా, తాజాగా రోజా మంత్రి పదవి చేపట్టడంతో జబర్తస్త్ నుంచి బయటికి వచ్చారు.

అయితే, ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కూడా తాజాగా జబర్దస్త్ నుంచి బయకొచ్చారు. కానీ, ఇప్పటివరకూ తాను జబర్దస్త్ నుంచి ఎందుకు? బయటికి వచ్చాననే విషయాన్ని ఎక్కడ వెల్లడించలేదు. మొదటిసారిగా ఆమె ఎందుకు జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో ఆ విషయాన్ని ప్రస్తావించారు.

”షోలో భాగంగా నాపై వేసే పంచులు నచ్చడం లేదు. పంచులు నచ్చక ఎన్నో సందర్భాల్లో ముఖం మాడ్చుకున్నా. కానీ, అవేవీ షోలో కనిపించలేదు. నాకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు అంటే నాకు నచ్చవు. క్రియేటివ్ ఫీల్డ్ అన్న తర్వాత ఇలాంటివి తప్పదు. కానీ, ఇదే ఊబిలో చిక్కుకుపోవాలని నేను అనుకోవడం లేదు. జబర్దస్త్ నుంచి బయటకు రావాలని రెండేళ్లుగా అనుకుంటున్నాను. అంతేకానీ, నాగబాబు, రోజాగారు షో నుంచి వెళ్లిపోయారని చెప్పి, నేను కూడా బయటకు రాలేదు. నటనపై దృష్టి పెట్టాలని అనుకున్నాను. నాకు జబర్దస్త్ షో అంటే ఎంతో ఇష్టం..కానీ, సినిమాల్లో నటన కారణంగా, జబర్దస్త్‌కు సమయం కుదరడం లేదు. అందుకే బయటికొచ్చాను”అని పేర్కొంది.

మరోపక్క జబర్ధస్త్ షోకు మొదటి నుంచి అనసూయ యాంకర్‌గా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఈ షోకు ప్రజాదరణలో అనసూయ పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పుకోవాలి. ఆమె అందచందాలు, హావభావాలు, వ్యాఖ్యానం షోకు అదనపు ఆకర్షణనించాయి. అలాంటి షోను వీడి రావడం వెనుక తనకు ఎదురైన అనుభవాలను ఆమె బయటపెట్టింది.