కేంద్రం సంచలనం.. 350 వస్తువుల దిగుమతిపై ఆంక్షలు.. - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రం సంచలనం.. 350 వస్తువుల దిగుమతిపై ఆంక్షలు..

July 12, 2020

350 types

దేశీయ సంస్థలకు ఊతమిచ్చే దిశలో కేంద్రం వివిధ అవసరాల కోసం దిగుమతి చేసుకునే 350 రకాల వస్తువులపై ఆంక్షలు విధించాలని భావిస్తోంది. వీటిల్లో ఎలక్ట్రానిక్‌, టెక్స్‌టైల్స్‌, తోలు వస్తువులు, బొమ్మలు, ఫర్నిచర్‌ వంటి వాటితో పాటు ఔషధాలు, టీవీలు, ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఆంక్షలు విధించాలని భావిస్తున్న వస్తువుల్లో అత్యధిక భాగం చైనా నుంచి దిగుమతి అయ్యేవే ఉన్నాయి. వీటి విలువ ఏటా 127 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటోంది. ఆయా వస్తువుల దిగుమతి అవసరాలను పరిశీలించేందుకు ఓ మానిటరింగ్‌ వ్యవస్థని ఏర్పాటు చేసే దిశలో యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యవస్థ అత్యవసరమైన వాటిని మాత్రమే పరిశీలించి లైసెన్స్‌ జారీ చేస్తుంది. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’కు ఊతమిచ్చేలా ఈ వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం నీతి ఆయోగ్‌, ఆర్థిక, వాణిజ్య, మైక్రో, ఎంఎస్‌ఎంఈలపై పనిచేస్తున్నాయి. 

మరోవైపు భారత్‌లో తయారుచేసే వస్తువులు మంచి నాణ్యతతో ఉండేట్లు ప్రమాణాలను సిద్ధం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. దీనిపై ఇప్పటికే బ్యూరో ఆఫ్‌ ఇండియాన్‌ స్టాండర్డ్స్‌ పనిచేస్తోంది. ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చి ఏ దేశంలో తయారైనవి, ఎంతమొత్తంలో, ఎంత విలువైనవి తదితరాలను కచ్చితంగా రిజిస్టర్‌ చేయనున్నారు. కాగా, స్టీల్‌ దిగుమతులపై ఇటువంటి విధానాన్ని ఇప్పటికే ‘స్టీల్‌ ఇంపోర్ట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌’ పేరిటి అమలు చేస్తున్నారు. గత నెలలోనే టైర్ల దిగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.