ఇక జేబులోనే ఫొటో ప్రింటర్..రూ. 9,999లకే - MicTv.in - Telugu News
mictv telugu

ఇక జేబులోనే ఫొటో ప్రింటర్..రూ. 9,999లకే

June 29, 2020

Instax

సాంకేతికత రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త స్మార్ట్ డివైస్ లు ఆవిష్కృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫుజిఫిల్మ్ భారత్ లో పాకెట్ సైజులో ఇన్‌స్టాక్స్ మినీ ఫొటో ప్రింటర్ ను లాంచ్ చేసింది. 

ఈ ప్రింటర్ ద్వారా మన ఫోన్‌ కెమెరా, ఫొటో లైబర్రీలోని ఫొటోలను క్రెడిట్ కార్డు సైజులో ప్రింట్ చేసుకోవచ్చు. ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ లింక్‌ను డెడికేటెడ్ యాప్ సాయంతో బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా మనకిష్టమైన ఫొటోలను అప్పటికప్పుడు ప్రింట్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకదాటిగా 100 ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు. దీని ధరను రూ.9,999గా నిర్ణయించింది. యాష్ వైట్, డస్కీ పింక్, డార్క్ డెనిమ్ వేరియంట్లలో ఈ ప్రింటర్ లభించనుంది. వచ్చే వారం నుంచి అమేజాన్, ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ సైట్ లలో అందుబాటులోకి రానుంది.