నిరుద్యోగులకు గుడ్‎న్యూస్, సింగరేణిలో ఖాళీలకు నోటిఫికేషన్..!! - Telugu News - Mic tv
mictv telugu

నిరుద్యోగులకు గుడ్‎న్యూస్, సింగరేణిలో ఖాళీలకు నోటిఫికేషన్..!!

February 1, 2023

Full details of notification for 588 posts in Singareni

 

నిరుద్యోగులకు శుభవార్త. సింగరేణిలో పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఫిబ్రవరి మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 588ఉద్యోగుాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. వీటిలో ఇంటర్నల్ అభ్యర్థులకు 277, ఎక్సటర్నల్ అభ్యర్థులకు 281 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. నిరుద్యోగులు 281పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను చూద్దాం.

ఖాళీలు :

మేనేజ్ మెంట్ ట్రైనీ విభాగంలో మైనింగ్ 79
మెకానికల్, ఎలక్ట్రికల్ పోస్టులు 66,
సివిల్ పోస్టులు 18,
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 10,
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 18,
ఐటీ 07,
హైడ్రోజియాలజిస్ట్ 02,
పర్సనల్ 22,
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 03,
జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ 10,
సబ్ ఓవర్ సీర్ ట్రైనీ – 16 ,
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 30

Full details of notification for 588 posts in Singareni

 

అంతర్గత నియామకాలు :

అసిస్టెంట్ ఈ గ్రేడ్ 2,
ఈ అండ్ ఎం పోస్టులు 30,
జూనియర్ ఇంజనీర్ 20,
అసిస్టెంట్ ఇంజనీర్ ఈ2
గ్రేడ్ సివిల్ 04,
జూనియర్ ఇంజనీర్ ఈ1
గ్రేడ్ సీవిల్ 04,
వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ ఈ 1
గ్రేడ్ పోస్టులు 11,
ప్రోగ్రామర్ ట్రైనీ ఈ 1 గ్రేడ్ 04..
జూనియర్ టెక్నికల్ ఇన్ స్పెక్టర్ 20,
ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 విభాగంలో 114,
ఎలక్ట్రిషియన్ ట్రైనీ విభాగంలో 22,
వెల్డర్ ట్రైనీ విభాగంలో 43,
శానిటరీ ఇన్ స్పెక్టర్ విభాగంలో 5 పోస్టులు

అర్హత, వయస్సు:

పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు, అర్హతకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://scclmines.com/scclnew/careers.asp ను చెక్ చేసుకోవచ్చు.