full syllabus implimented from this year : inter board
mictv telugu

ఇంటర్ బోర్డు హెచ్చరిక.. ఈ ఏడాది పూర్తిగా అమలు

June 24, 2022

full syllabus implimented from this year : inter board

తెలంగాణలో ఇంటర్ చదివే వారికి బోర్డు కీలక సమాచారం ఇచ్చింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సిలబస్‌ను 70 శాతానికి తగ్గించారు. పరీక్షల్లో ప్రశ్నలు కూడా 70 శాతం సిలబస్ నుంచే ఇచ్చారు. అయితే కరోనా అదుపులోనే ఉండడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి మాత్రం పూర్తి స్థాయి సిలబస్ ఉంటుందని ఇంటర్ బోర్డు ప్రకటించింది. పాత విధానం ప్రకారమే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు వంద శాతం సిలబస్ అమల్లో వస్తుందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమాచారాన్ని ఇంటర్ బోర్డు వెబ్‌సైట్లో కూడా పెడతామని పేర్కొన్నారు.