డేటా లీకేజీతోపాటు పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ జుకర్‌బర్గ్‌కు ఊహించని షాక్ తగిలింది. అతణ్ని కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని సంస్థలో భారీ వాటాలను సొంత చేసుకున్న నాలుగు అమెరికన్ పబ్లిక్ ఫండ్ కంపెనీలు ప్రతిపాదించాయి. సంస్థ అసెట్ మేనేజర్లు కూడా ఈ ప్రతిపాదనకు బోర్డు అంగీకరిస్తే జకర్కు కష్టమే. అయితే జుకర్‌బర్గ్ కంపెనీలో 60 శాతం వాటా కలిగి ఉండడంతో ఆయన తొలగింపు అంత సులభమేమీ కాదని కూడా అంటున్నారు.
ఇలినాయ్, రోడ్ ఐలండ్, పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్ ట్రెజర్స్, న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ ఫండ్స్ సంస్థలు ఈ ప్రతిపాదించాయి. జుకర్‌బర్గ్‌ను తప్పించి అతని బాధ్యతలను సమర్థుడైన, ఆరోపణలు లేని వ్యక్తికి కట్టబెట్టాలని కోరాయి. డేటా చోరీ, కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాం నుంచి సంస్థను కాపాడుకోవాలంటే జుకర్‌బర్గ్‌ను తప్పించడం మినహా మరో మార్గం లేదని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్స్ పేర్కొన్నారు. వచ్చే వార్షిక సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. ఫేస్బుక్ సర్వసభ్య సమావేశం 2019 మేలో జరుగనుండగా, ఇండిపెండెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఆ సంస్థల ప్రతిపాదన ఎఫ్బీ మార్కెట్ వాల్యూపై వెంటన ప్రభావం చూపింది. కంపెనీ ఈక్విటీ 10 శాతం పడిపోయింది. మొత్తానికి ఎఫ్బీ నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నట్లు వాటాదార్లు అనుమానిస్తున్నట్లు ఈ వ్యవహారం చెబుతోంది. అయితే దీనిపై ఎఫ్బీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఎఫ్బీ బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ ఫేస్‌బుక్‌కు చెందిన 5కోట్ల మంది ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు రావడం తెలిసిందే. అంతేకాకుండా కోట్లాది యూజర్ల ఖాతాలు హ్యాకింగ్ కు గురయ్యాయి. జుకర్‌ను చైర్మన్ పోస్టు తప్పించాలని 2017లోనూ ఓ ప్రతిపాదన వచ్చింది. అయితే అతనిపై అప్పటికి ఇంకా నమ్మకం ఉండడంతో అది వీగిపోయింది. పెన్సిల్వేనియా ట్రెజరీకి 38,737 షేర్లు, ఇలినాయ్ ట్రెజరీకి 1,90,712 షేర్లు, రోడ్ ఐలండ్ ట్రెజరీకి 1,68,230 షేర్లు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో కేసు
మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్, చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్, ఫేస్ బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్‌లపై ఉత్తరప్రదేశ్ లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలైంది. వీరు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీల లెటర్హెడ్లను, భారత జాతీయ చిహ్నాలను అనుమతులు లేకుండా ఎఫ్బీలో పెట్టినందుకు చర్య తీసుకోవాలని పిటిషనర్ కోరారు.