ఏడాది తర్వాత అంత్యక్రియలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏడాది తర్వాత అంత్యక్రియలు

October 26, 2017

థాయ్‌లాండ్ దివంగత రాజు భూమిబల్ అదుల్యతేజ్ అంత్యక్రియలను ఆయన చనిపోయిన ఏడాది తర్వాత గురువారం అశ్రునయనాలతో ప్రతీకాత్మకంగా పూర్తి చేశారు. బ్యాంకాక్ నగరంలో లక్షలాది ప్రజలు వెంటరాగా, అధికార లాంఛనాలతో రాజుగారి అస్థికలను బంగారు పల్లకిలో పెట్టి ఊరేగించారు.

14 టన్నుల అంతిమయాత్ర రథాన్ని 200 మంది సైనికులు లాగారు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు సాగాయి. భూమిబల్ అతుల్యతేజ్ భౌతిక అస్థికలను చితిలో ఉంచాక ఆయన కుమారుడు మహా వజిరలోంగ్‌కోర్న్ నిప్పు అంటించారు. 70 ఏళ్ల దేశాన్ని ఏలిన భుమిబల్‌ గతేడాది అక్టోబర్‌ 13న  88 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చనిపోయారు. ఆధునిక కాలంలో ఎక్కువ కాలం పాలించిన రాజు ఆయనే. ఆయన అంత్యక్రియలను 90 మిలియన్ డాలర్లు ఖర్చయింది.