క్యాష్ ఇవ్వండి.. నవ్వులు పుట్టిస్తున్న పెళ్లిపత్రిక - MicTv.in - Telugu News
mictv telugu

క్యాష్ ఇవ్వండి.. నవ్వులు పుట్టిస్తున్న పెళ్లిపత్రిక

November 13, 2019

‘సకుటుంబ సపరివారంగా వచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన.. కానుకలు స్వీకరించబడవు..’ అని పెళ్లిపత్రికల్లో రాస్తుంటారు. అయినా మర్యాద కోసం ఆహూతులు కానుకలు ఇస్తుంటారు. చదివింపులు కూడా చేస్తుంటారు. డబ్బులు ఇస్తే గుర్తించుకోరని, మిక్సీ, కుక్కర్ వంటి కానుకలు ఇస్తే వాడి వాడినప్పుల్లా తమను గుర్తుపెట్టుకుంటారని కొందరు వాటిపైనే మొగ్గుచూపుతుంటారు. వధూవరులు కూడా వాటిని స్వీకరిస్తూ నవ్వుతూ ఫోటోలకు పోజులు ఇస్తారు. 

View this post on Instagram

An honest #wedding card. Please #RSVP

A post shared by Akshar Pathak (@aksharpathak) on

అయితే తమకు కానుకలు గట్రా వద్దని, కేవలం క్యాష్ మాత్రమే కావాలని వధూవరులు కోరితే ఎలా ఉంటుంది? ఇదిలో ఈ పెళ్లి కార్డులా ఉంటుంది. హిందీ హాస్యనటుడు అక్షర్ పాఠక్ దీన్ని తయారు చేశారు. ‘శర్మా జీ కా లడకా, వర్మా జీ కా లడకీ’ పెళ్లి చేసుకుంటున్నారంటూ సరదా, సటైర్లతో దీన్ని మూడు పేజీలతో రూపొందించాడు. ‘కానుకలు వద్దు, క్యాష్ ఇవ్వండి.. 18 జ్యూసర్, మిక్సీ, గ్రైండర్లతో మేం ఏం చేసుకుంటాం.. ’ అని వధూవరులు విసుక్కుంటున్నట్లు అందులో రాశారు. దీంతో ఈ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల మంది దీని చూసి నవ్వుకుంటున్నారు. ఇందులో చిరుమానా మ్యాప్ పైనా సటైర్లు వేశారు. ఈ మ్యాప్ పై నమ్మకం పెట్టుకోకండని ముద్రించారు. దీపికా పడుకోన్, రణ్‌వీర్, ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్‌ల మాదిరి తాము కూడా రెండు మూడు రిసెప్షన్లు ఇస్తామని, నాలుగైదు పెళ్లిళ్లు ఎక్కడ జరుగుతుంటే అక్కడే వివాహ వేదికని జోకులు పేల్చారు. 22 వేల పెళ్లిళ్లు జరుగుతున్నాయని, మీరు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతారని హడలెత్తించారు.