మాజీ స్పీకర్ కోడెల నివాసంలో చోరీ
ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో జరుగుతున్న వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సామాగ్రీ అంతా తన వద్దే ఉందని చెప్పిన కోడెల శివప్రసాద్ వాటిని తీసుకెళ్లాలంటూ ఇటీవల చెప్పాడు. అయితే వాటిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు వెళ్లే కంటే కొద్దిసేపు ముందు కంప్యూటర్లు చోరీకి గురైనట్టు ఆయన కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అవి కోడెల నివాసానికి సమీపంలోనే లభించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో రాత్రి సమయంలో కరెంట్ పని కోసం ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టు అక్కడి వారు చెబుతున్నారు. వాచ్‌మెన్‌ను తోసేసి కంప్యూటర్లు తీసుకెళ్లారని కేసు పెట్టారు. కానీ అవి కొంత దూరంలోనే ఉన్నట్టు కోడెల అనుచరులు గుర్తించారు. వాటిల్లో ఉన్న డేటా చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై నిజాలు వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.