అంతా తూచ్..నువ్వు గొప్పంటే నువ్వు గొప్ప..ఇంకెక్కడి యుద్ధం..! - MicTv.in - Telugu News
mictv telugu

అంతా తూచ్..నువ్వు గొప్పంటే నువ్వు గొప్ప..ఇంకెక్కడి యుద్ధం..!

July 7, 2017

శత్రువులు ఇద్దరు ఎదురుపడ్డారు. మాట్లాడుకోలేకపోయిన…ప్రసంగాల్లో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. దోస్త్ మేరా దోస్త్… ఎహె నువ్వు గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ అంటూ పొగుడుకున్నారు. వాళ్లిద్దరు ఎవరో కాదు భారత్ చైనా అధినేతలు..వీళ్లే ఇలా ఉంటే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉంటాయా…?నిన్నటిదాకా ఉన్నా..ఇప్పుడు అస్సలు ఉండవు..ఉన్నాయంటే ఇరుదేశాల పరువుపోదు…అందుకే మూడు,నాలుగు రోజులు ఉద్రిక్తతలకు విరామం.

జర్మనీలో హాంబర్గ్‌లో ప్రారంభమైన జీ20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బ్రిక్స్‌ సమావేశాల్లో మోదీ, జిన్‌పింగ్‌లు ఎదురుపడ్డారు. ఈ సమావేశంలో భారత్‌పై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రశంసలు కురిపించడం విశేషం. వీరిద్దరూ కలిసి మాట్లాడుకోలేదు కానీ.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. తొలుత మాట్లాడిన భారత ప్రధాని మోదీ.. చైనా నాయకత్వంలో బ్రిక్స్‌ నిర్వహణను అభినందించారు. ఈ ఏడాది చివర్లో చైనాలోని జియామెన్‌లో నిర్వహించే బ్రిక్స్‌ సదస్సుకు భారత్‌ పూర్తి మద్దతిస్తుందన్నారు.

ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై భారత్‌ పోరును ప్రశంసించారు. అంతేగాక.. ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని మెచ్చుకున్నారు. మున్ముందు కూడా మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సమావేశం తర్వాత ఇరుదేశాధినేతలు కరచాలనం చేసుకొని కాసేపు మాట్లాడుకున్నారు.

ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు.సో సిక్కిం సరిహద్దులో టెన్షన్ వాతావరం తగ్గే అవకాశం ఉంది. దీన్నే సంకేతంగా భావించి ఇరుదేశాల సైన్యాలు కొద్దిరోజులు శాంతించ వచ్చు. యుద్ధం వస్తుందా అని చర్చించుకున్నవాళ్లకు వీరి చర్యలతో ఎట్టి పరిస్థితుల్లోనే రాదని తేలిపోయింది.