BJP విజయ సంకల్ప సభకు ప్రజాగాయకుడు గద్దర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

BJP విజయ సంకల్ప సభకు ప్రజాగాయకుడు గద్దర్‌

July 3, 2022

హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ సభకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరయ్యారు. బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ జరిగే ప్రాంగణానికి గద్దర్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గద్దర్ పెరేడ్ గ్రౌండ్ కు రావడం బీజేపీ శ్రేణులనే ఆశ్చర్యపరచగా.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో రాహుల్ గాంధీ ప్రతిపక్షాల సభకు హాజరైన గద్దర్ ఇవాళ మోడీ సభకు హాజరుకావడం గమనార్హం. వీఐపీ పాస్‌తో సభకు హాజరైన ఆయన.. దేశం, తెలంగాణ గురించి ప్రధాని ఏం చెప్తారో వినడానికే తాను వచ్చానన్నారు. ప్రధాని మోదీ మాట్లాడాక స్పందిస్తానని చెప్పారు గద్దర్‌.