కాంగ్రెస్‌లోకి గద్దర్ తనయుడు   - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్‌లోకి గద్దర్ తనయుడు  

April 24, 2018

గద్దర్.. ఈ మాట వినగానే ప్రజాపోరాట పాటలు, నక్సలైట్ రాజకీయాలు గుర్తుకువస్తాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, సమసమాజం కోసం పోరాడుతున్న నక్సలైట్లకు గద్దర్ ఒక బహిరంగ గొంతుక.

అయితే కొన్నాళ్ల నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చి, ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గద్దర్ కుమారుడు సూర్య రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో సూర్య ‘హస్తం’ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఏఐసీసీ భవనంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది.