బెల్లంపల్లి నుంచి బరిలోకి గద్దర్ తనయుడు ? - MicTv.in - Telugu News
mictv telugu

బెల్లంపల్లి నుంచి బరిలోకి గద్దర్ తనయుడు ?

October 15, 2018

బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ తనయుడు సూర్యకిరణ్ బరిలోకి దిగినున్నట్టు తెలుస్తోంది. కమ్యూనిస్టుల భావజాలం అధికంగా వుండే బెల్లంపల్లి నుంచి పోటీ చేయడమే ఆయన ఉత్తమంగా భావిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నివసించే సూర్యకిరణ్ అక్కడినుంచి పోటీ చేయకపోవడం వెనుక కారణం ఇదే అయివుంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. మహాకూటమి పొత్తులో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని సీపీఐకి ఇస్తారని భావించారు. సీపీఐ పోటీచేసే జాబితాలో బెల్లంపల్లి కూడా వుంది.  Gaddar's son from Bellampalliమొన్న గద్దర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను కలుసుకున్నప్పటి నుంచి రకరకాల ఊహాగానాాలు వినిపించాయి. కానీ గద్దర్ వాళ్ళను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు మీడియాకు స్పష్టంచేశారు. ఆరు నెలల కిందట కొడుకు సూర్యకిరణ్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పోటీకి తండ్రి బ్రాండ్ నేమ్‌ తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అందుకే తండ్రితో పాటు ఆరోజు కాంగ్రెస్ రథసారథులను కలిశారు. ఈ క్రమంలో సూర్యకిరణ్ బెల్లంపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు దృవీకరిస్తున్నాయి. ఇక్కడనుంచి గతంలో పోటీ చేసిన చిలుముల శంకర్ మరోసారి ఆసక్తి చూపుతున్నప్పటికీ, చిన్నయ్యను ఢీకొట్టాలంటే గద్దర తనయుడు సూర్యనే బలమైన వ్యక్తిగా భావిస్తోంది. గత మే నెలలో మంచిర్యాలలో జరిగిన ప్రజాచైతన్య యాత్రలో సూర్యకిరణ్ పాల్గొని, బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారు.