నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కడెం మండలం గండిగోపాల్పూర్లో గ్రామానికి చెందిన మేకల కాపరి గాదె నర్సయ్య (50) అనుమానాస్పదంగా మృతిచెందాడు.
అటవీశాఖ అధికారులు కొట్టడం వల్లే నర్సయ్య చనిపోయి ఉంటాడని అతడి కుటుంబసభ్యులు, బంధువుల ఆరోపిస్తున్నారు. మేకలు మేపుకుంటూ నర్సయ్య అడవిలోకి వెళ్లడంతో అటవీశాఖ అధికారులు అతన్ని తీవ్రంగా కొట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉడుంపూర్ అటవీశాఖ ఆఫీస్ పై గ్రామస్థులు దాడి చేశారు. ఆఫీస్ లోని ఫర్నిచర్, వాహనంను ధ్వంసం చేశారు.