ప్లీనరీకి తుపాకీతో వచ్చిన జెడ్పీటీసీ.. పట్టుకున్న పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

ప్లీనరీకి తుపాకీతో వచ్చిన జెడ్పీటీసీ.. పట్టుకున్న పోలీసులు

July 10, 2022

ఏపీ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ప్లీనరీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఓ జెడ్పీటీసీ తుపాకీతో వచ్చి కలకలం రేపారు. శుక్రవారం రోజు జరిగిన ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా పాణ్యం నియోజక వర్గం గడివేముల మండల వైసీపీ జెడ్పీటీసీ ఆర్‌బీ చంద్రశేఖర్ రెడ్డి తుపాకీతో సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రవేశ ద్వారం దగ్గర ఆయనను అడ్డుకున్న పోలీసులు చెకింగ్ చేసి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత తుపాకీని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. అనంతరం తుపాకీ కలిగి ఉన్న లైసెన్స్ పత్రాలను సదరు జెడ్పీటీసీ చూపించడంతో సమావేశాల తర్వాత తుపాకీని తిరిగి అప్పగించారు. ఈ విషయంపై జెడ్పీటీసీ మాట్లాడుతూ.. ‘తుపాకీ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. పార్టీ ప్లీనరీ నేపథ్యంలో దానిని కారులో వదిలి పెట్టడం క్షేమకరం కాదన్న ఉద్దేశంతో నా వెంట తీసుకొచ్చాను. అంతే తప్ప ఇందులో ఎలాంటి విశేషం, ప్రాధాన్యం లేదు’ అని పేర్కొన్నారు.