గద్వాల్ మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

గద్వాల్ మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూత

June 12, 2019

Gadwal ex mla gattu bheemudu died due to health issues.

టీఆర్ఎస్ నాయకుడు, గద్వాల్‌ మాజీ ఎమ్మెల్యే గట్టు బీముడు తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పదిరోజుల క్రితం నిమ్స్‌లో చేరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ తరఫున గద్వాల్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఆయన విశ్వాసపాత్రునిగా ఉండేవారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.