264 కిలో మీటర్లు నడిచి రాంచరణ్‌కు బియ్యం ఇచ్చిన యువకుడు - MicTv.in - Telugu News
mictv telugu

264 కిలో మీటర్లు నడిచి రాంచరణ్‌కు బియ్యం ఇచ్చిన యువకుడు

May 28, 2022

సినీ హీరోలకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు. వారంతా తమ అభిమానాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. కొందరు అందులోనే వెరైటీగా ఆలోచించి అందరి ద‌ృష్టి తనవైపు తిప్పుకునేలా చేసే పనులు చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అభిమాని ఆ కోవకు చెందినవాడు. వివరాలు.. తెలంగాణ గద్వాల జిల్లా గొర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే యువకుడు ఎకరా పొలం కౌలుకు తీసుకొని తన అభిమాన హీరో రాంచరణ్ ముఖ ఆకారంలో వరి సాగు చేశాడు. పంట పండిన అనంతరం ధాన్యాన్ని మర పట్టించి ఆ బియ్యాన్ని హీరోకు కానుకగా ఇచ్చాడు. ఇందుకోసం గద్వాల నుంచి హైదరాబాదు వరకు పాదయాత్ర చేసి మరీ ఇవ్వడం గమనార్హం. రాం చరణ్ ఇంటికి చేరుకొని ఆయనను కలిసి బియ్యాన్ని అందజేశాడు. తన అభిమాని చేసిన పనికి రాం చరణ్ ఫిదా అయిపోయారు. ఆయనకు తగిన మర్యాదలు చేసి ఫోటోలు దిగి సాగనంపాడు. ఇప్పుడీ ఫోటోలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా, జైరాజ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.