Gadwal mla bandla krishnamohan reddy issue
mictv telugu

విద్యాధికారి గొంతు పట్టుకున్న ఎమ్మెల్యే..

November 22, 2022

Gadwal mla bandla krishnamohan reddy issue

అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు అని ఒక సామెత ఉంది. గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరు అలాగే ఉందని విమర్శలు వస్తున్నాయి. ఆయన జిల్లా స్థాయి విద్యాధికారి గొంతు పట్టుకుని బండబూతులు తిడుతూ నెట్టేయడమే దీనికి కారణం.

జెడ్సీ చైర్‌పర్సన్ సరితకు, ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. గద్వాలలో మంగళవారం బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఈ గొడవకు వేదికైంది. ముఖ్య అతిథిగా రావాల్సిన కృష్ణమోహన్ రెడ్డి కాస్తా ఆలస్యంగా వచ్చారు. అప్పటికే జడ్పీ చైర్‌పర్సన్ సరిత ఆ స్కూల్‌ను ప్రారంభించారు. తను రాకముందే ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే ఆగ్రహించారు. గురుకుల పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ వెంగళ్ రెడ్డి నచ్చబెప్పే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే ఆయన కాలర్ పట్టుకుని దాడి చేయబోయారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని పక్కకు లాగారు. విద్యార్థులు, టీచర్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనో ఎమ్మెల్యే అలా ప్రవర్తించడంతో విమర్శలు వస్తున్నాయి. జడ్పీ చైర్‌ పర్సన్ ఎన్నిక సమయంలోసరితకు, ఎమ్మెల్యేలకు మధ్య గొడవలు మొదలయ్యాయి. సరితకు కొంతమంది పెద్ద నేతల అండ ఉండడంతో దూకుడు ప్రదర్శిస్తున్నారని టాక్.