ఫేస్‌బుక్ ఆఫీసు ముందు భారీ రొమ్ము.. రోగుల నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ ఆఫీసు ముందు భారీ రొమ్ము.. రోగుల నిరసన

November 17, 2019

breast

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇటీవల పోర్న్, అశ్లీల సంబంధ కంటెంట్‌పై కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. చివరికి వంకాయలు, పియరీ పళ్లు వంటి ‘నగ్నత్వాన్ని’ గుర్తుకు తెచ్చే ఫొటోలను కూడా తీసేస్తోంది. దీనిపై విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని రకాల పచ్చబొట్లకూ కత్తెర వేస్తోంది. ఈ నేపథ్యంలో లండన్‌లోని ఫేస్‌బుక్ కార్యాలయం ముందు కేన్సర్ రోగులు ధర్నాకు దిగారు. 

వారిలో కేన్సర్ సర్జరీల తర్వాత చనుమొనలు కోల్పోయిన వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. చనుమొన స్థానంలో అవి ఉన్నట్లు పచ్చబొట్లు వేసే వికీ మార్టిన్ ఈ నిరసనకు తెరతీశారు. చనుమొనల టాటూలు కూడా పోర్న్ కంటెంట్ కిందికే వస్తాయంటూ ఫేస్‌బుక్ తన ఖాతాను బ్లాక్ చేసిందని విక్కీ ఆరోపించారు. దీనికి నిరసగా బెలూన్ ఆకారంలో భారీ రొమ్మును రూపొందించి ఫేస్ బుక్ ఆఫీసు ముందు ఉంచారు. ఫేస్‌బుక్ ఆంక్షల ఫలితంగా తమ కష్టాలను, కన్నీళ్లను వెళ్లబోసుకునే అవకాశం లేకుండా పోయిందని కేన్సర్ రోగులు, ఆ వ్యాధి నుంచి బయటిపడిన వారు మండిపడుతున్నారు.