Gajanan poured petrol on Pooja and set her on fire in ourangabad
mictv telugu

ప్రియురాలితో మాట్లాడుతున్న ప్రియుడు.. మధ్యలో ఏం చేశాడంటే

November 22, 2022

Gajanan poured petrol on Pooja and set her on fire in ourangabad

ప్రేమికుల మధ్య కొన్ని సార్లు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. మొదట్లో ప్రేమించుకొని తర్వాత పెళ్లి చేసుకుందామని ఎన్నో ఊసులు చెప్పుకుంటారు. ఎంతో ఎంజాయ్ చేస్తారు. తీరా సమయం వచ్చేసరికి ఇద్దరిలో ఒకరు అభిప్రాయం మార్చేసుకుంటారు. దీంతో మరో వ్యక్తి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణమవుతారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో ఓ యువకుడు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. గజానన్ అనే యువకుడికి పూజ అనే యువతి పరిచయమైంది. ఆమె ఓ కాలేజీలో జువాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా స్నేహానికి వెళ్లి ప్రేమగా మారింది. ఇద్దరూ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో ఎలాగూ కాబోయే భార్య కదా అని గజానన్ ఆమెపై భారీగా డబ్బు ఖర్చు పెట్టాడు.

ఆమె కూడా అతనితో ప్రేమగా ఉంటూ ఎంజాయ్ చేసింది. అయితే ఇటీవల గజానన్ పూజ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కానీ పూజ ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన గజానన్.. ఒప్పుకోవాలంటూ రోజూ ఆమె వెంటపడుతూ గొడవ పడేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలో సోమవారం పూజ కాలేజీకి వెళ్లిన గజానన్.. మాట్లాడే పని ఉందంటూ పిలిచి మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. పూజ మరోసారి ఒప్పుకోకపోవడంతో ఆవేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. కొంత పెట్రోల్ పూజపై కూడా పోసి మండుతున్న తన దేహంతో ఆమెను కౌగిలించుకున్నాడు. ఇద్దరూ మంటల్లో కాలిపోతుండడంతో స్థానికులు స్పందించి వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గజానన్ మరణించాడు. పూజ్ మాత్రం 50 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రితో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.