Gajuwaka Conductor Jhansi dance performance adurs in a TV Show
mictv telugu

డ్యాన్స్ షో లో అదుర్స్ అనిపించిన గాజువాక లేడీ కండక్టర్

August 28, 2022

గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ తన డ్యాన్స్‌తో ఇప్పుడు కుర్రకారుని హుషారెత్తిస్తోంది. పెళ్లై , ఇద్దరు పిల్లలున్నా.. డాన్స్ మీదున్న ఇష్టంతో, అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ షోలు చేస్తోంది. తాజాగా ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన డాన్స్ షో తన మాస్ స్టెప్పులతో జడ్జీల మతి పోగెట్టేసింది. ఆ షో లో జడ్జీలు స్టేజ్‌పైకి వెళ్లి.. ఆమెతో కలిసి స్టెప్పులేసి అభినందించారు.

ఏపీలోని విశాఖపట్నం జిల్లా గాజువాక కు చెందిన ఎ.ఝాన్సీ ఆర్టీసీ డిపో కండక్టర్. తండ్రి బాధ్యత మరచి.. భార్యాపిల్లల్ని వదిలేయడంతో తల్లికి అండగా నిలిచింది. ఓ వైపు చదువుకుంటూనే తనకి ఎంతో ఇష్టమైన డాన్స్‌ని నేర్చుకుంది. 2011లో ఆర్టీసీలో కండక్టర్‌గా ఎంపికై, ఏడాది ట్రైనింగ్ తర్వాత గాజువాక డిపోలో విధుల్లో చేరింది. ఆ తర్వాత డాన్స్ పై తనకున్న ఇష్టంతో డ్యాన్స్‌ మాస్టర్లు దగ్గర చేరి వివిధ వేదికలపై ప్రదర్శన ఇచ్చింది.

తనకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని, తన భర్త నూకరాజు తనకు చాలా సపోర్ట్ చేస్తారని చెప్పింది. ఓ వైపు డాన్స్ షో లు, మరోవైపు ఉద్యోగం.. అన్నీ బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేస్తున్నానంటే తన డిపోవాళ్లు ఇస్తున్న ప్రోత్సాహమే కారణమని చెప్పింది. తాను డాన్స్‌లో ఎంత జోష్‌గా ఉంటానో డ్యూటీలో కూడా అదే జోష్ చూపిస్తానంటోంది. అందుకే తన బస్ ఎక్కడానికి చాలా ఇంట్రస్ట్ చూపిస్తారని చెప్పింది.” నేను టికెట్ అడిగే విధానం కానీ.. పాస్ చూసే విధానం కానీ డిఫరెంట్‌గా ఉంటుంది.. స్ట్రిక్ట్‌గా ఉంటాను.. సరదాగానూ ఉంటాను. భవిష్యత్తులో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం” అని చెప్పింది ఈ లేడీ కండక్టర్.