శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్.. వచ్చేస్తోంది - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్.. వచ్చేస్తోంది

September 25, 2019

Galaxy Fold releasing in India soon.

టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. స్మార్ట్ ఫోన్ నుంచి ఫోల్డ్ ఫోన్ల వైపు పరుగులు తీస్తుంది. ఈ క్రమంలో ఉత్తర కొరియాకు చెందిన శాంసంగ్ ప్రపంచంలో తొలిసారిగా ఫోల్డబుల్‌ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసింది. గెలాక్సీ ఫోల్డ్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్‌గానూ, ట్యాబ్లెట్‌ పీసీగానూ దీనిని వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో మొత్తం ఆరు కెమెరాలు పొందుపరిచారు. ఫోల్డ్ తెరిచినప్పుడు 7.3 ఇంచెస్ స్క్రీన్ ట్యాబ్లెట్‌ పీసీ మాదిరిగా, ఫోల్డ్ మూసినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్‌తో స్మార్ట్‌ఫోన్‌ వలె ఉపయోగించొచ్చు. ఈ ఫోల్డ్ ఫోన్‌ను దక్షిణ కొరియాలో ఇటీవలే విడుదల చేశారు. అమెరికాలో ఈ నెల 27న ఆవిష్కరించనున్నారు. భారత మార్కెట్‌లో అక్టోబర్ 1న విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ గెలాక్సీ ఫోల్డ్‌ ధర సుమారు రూ.1.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. స్పేస్‌ సిల్వర్, కాస్మోస్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ప్రత్యేకతలు

* ఫోల్డ్ తెరిచినప్పుడు 7.3 ఇంచెస్ స్క్రీన్,

* ఫోల్డ్ మూసినప్పుడు 4.6 ఇంచెస్ స్క్రీన్,

* 12 జీబీ ర్యామ్, 

* 512 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 

* ఆరు కెమెరాలు,

* 7 నానోమీటర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ఆక్టాకోర్‌ చిప్‌,

* 4,380 ఎంఏహెచ్‌ బ్యాటరీ,

* 5జీ టెక్నాలజీ.