శాంసంగ్ మడతపెట్టే ఫోన్.. ఏప్రిల్ 26 నుంచి లభ్యం - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ మడతపెట్టే ఫోన్.. ఏప్రిల్ 26 నుంచి లభ్యం

April 14, 2019

శాంసంగ్ కంపెనీ త‌న మడత పెట్టే ఫోనును త్వరలో మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. గెలాక్సీ ఫోల్డ్‌గా పిలువబడే ఈ ఫోనును గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెరికా మార్కెట్‌లో ల‌భ్యం కానుంది. అందుకుగాను సోమవారం నుంచి ఈ ఫోన్‌కు ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించ‌నున్నారు. శాంసంగ్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అమెరికాలోని టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ, టి-మొబైల్‌లు ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నాయి. దీని ధర అమెరికాలో 1980 డాల‌ర్ల‌ కాగా ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.1,40,760 ఉండనుంది

.Galaxy Fold presale: You can still register to preorder Samsung's foldable phone on April 15

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

* 7.3 ఇంచుల ప్రైమ‌రీ డిస్‌ప్లే,

* 4.6 ఇంచుల సెకండ‌రీ డిస్‌ప్లే,

* స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌,

* 12 జీబీ ర్యామ్‌,

* 4380 ఎంఏహెచ్ బ్యాట‌రీ,

* వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్,

* ఆండ్రాయిడ్ 9 (పై),

* 12 జీబీ ర్యామ్,

* 512 ఇంటర్నల్ స్టోరేజి,

* ఫింగర్ ప్రింట్ సెన్సార్.